వైసీపీ మూడో జాబితాలో 30 మంది? ఈ సారి టార్గెట్ వారేనా?

By SumaBala BukkaFirst Published Jan 8, 2024, 12:21 PM IST
Highlights

ఈ జాబితాలో 30మంది ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఎక్కువమంది ఎంపీలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో టికెట్ దక్కుతుందో లేదేనన్న టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీలో మార్పుల జాబితా తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ఇప్పటికే మొదటి జాబితాలో 11మంది, రెండో జాబితాలో 37మందిని ప్రకటించిన వైసీపీ రెండు,మూడు రోజుల్లో మూడో జాబితాను ప్రకటించబోతోంది. 

ఈ జాబితాలో 30మంది ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఎక్కువమంది ఎంపీలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 మంది ఎంపీ, 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

తండ్రి కేశినేని నాని బాటలోనే కూతురు శ్వేత ... టిడిపికి రాజీనామా

ఇందులో భాగంగా మాజీమంత్రి బాలినేనిని ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యే కు కూడా పిలువు వెళ్లింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. 

దీంతో అధికార వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండు జాబితాల్లో టికెట్లు దక్కని వారు వైసీపీకి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. కొంతమంది వైరేపార్టీల్లో కూడా చేరారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితో ఆమెతో నడవడానికి సిద్ధం అని మరికొందరు నేతలు బాహాటంగానే ప్రకటించారు. 

ఈ సమయంలో మూడో జాబితా వైసీపీలో మరో కలకలానికి తెరతీయనుందని అనుకుంటున్నారు. మరోవైపు అసంతృప్త నేతలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. వినేవాళ్లు వింటున్నారు. కొంతమంది దీనికి కూడా అందుబాటులో ఉండడం లేదు. కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలాంటి నేతలు పార్టీపై, అధినాయకుడిపై విమర్శలతో బైటికి వచ్చేశారు. 

ఏవో సర్వేలు పట్టుకుని గెలవమంటే ఊరుకోమంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జగన్‌పై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందా..? అసంతృప్తులు, అసమ్మతులు జగన్‌ పుట్టె ముంచుతాయా..? ఎమ్మెల్యేలు, ఎంపీల స్వరంతో పాటు చూపు కూడా మారుతోందా..? టీడీపీ, జనసేనలో చేరేందుకు వైసీపీ శ్రేణులు క్యూ కడుతున్నాయా..? మూడో జాబితా వచ్చే సరికి వైసీపీ పరిస్థితి ఏమిటో..? అనే చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. దీని గురించి క్లారిటీ రావాలంటే మూడో లిస్ట్ వచ్చేవరకూ ఆగాల్సిందే. 

click me!