తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

By narsimha lode  |  First Published Sep 15, 2019, 1:55 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో పడవ మునిగింది.ఈ సమయంలో పడవలో 61 మంది ప్రయాణం చేస్తున్నారు. 


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరులో 61 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ ఆదివారం నాబు బోల్తా పడింది.  ఈ పడవ నుండి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 14 మందిని తూటుగుంట గ్రామస్తులు కాపాడారు.మిగిలిన 41 మంది కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.

దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు వద్ద రాయల్ పున్నమి బోటు గోదావరిలో మునిగిపోయింది. 40 మంది పర్యాటకులతో పాపికొండలకు బోటు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గండిపోచమ్మ ఆలయం నుండి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

Latest Videos

undefined

కచ్చులూరులో బోటు ఆగిపోయింది.  ఈ ప్రాంతం  చాలా లోతుగా ఉంటుంది. సుడి గుండాలు కూడ ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరి నదిలో లైఫ్ జాకెట్లతో కొట్టుకుపోతున్న 10 మందిని తూటుగుంట గ్రామస్తులు కాపాడారు. మరో 14 మంది లైఫ్ జాకెట్లు ఉన్నందున బయటపడినట్టుగా సమాచారం.

ప్రస్తుతం గోదావరి నదిలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు.  కాఫర్ డ్యామ్ నుండి వేగంగా నీరు దిగువగా వచ్చే అవకాశం ఉంది. కచ్చలూరులో  గోదావరి నదిలో సుమారు 80 అడుగుల మేరకు లోతు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.


 

click me!