పవన్ బర్త్ డే: 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్... ముగ్గురు అభిమానులు మృతి

Siva Kodati |  
Published : Sep 01, 2020, 10:04 PM ISTUpdated : Sep 01, 2020, 10:12 PM IST
పవన్ బర్త్ డే: 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్... ముగ్గురు అభిమానులు మృతి

సారాంశం

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి  కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి  కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు.

సుమారు 25 అడుగుల ఎత్తున ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు వేడుకలకు ప్లాన్ చేశారు.

మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఇదే ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై బ్యానర్ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu