విజయవాడ గొల్లపూడిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Mar 17, 2023, 03:56 PM IST
విజయవాడ గొల్లపూడిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

విజయవాడ గొల్లపూడిలో ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను రాజేశ్వరి, నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధగా గుర్తించారు. 

విజయవాడ గొల్లపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను రాజేశ్వరి, నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధగా గుర్తించారు. శుక్రవారం ఉదయం స్ధానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. నాగ ఫణీంద్ర స్థానికంగా జిరాక్స్ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu