కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో మోడీతో జగన్ భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.
also read:మోడీతో జగన్ భేటీ: 14 అంశాలపై వినతి పత్రం
ఏపీ పునర్విభజనపై ప్రధాని వద్ద ప్రస్తావించిన అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద జగన్ ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టం లో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కూడా సీఎం జగన్ కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షాకు వినతి పత్రం సమర్పించారు.