పాక్ అదుపులో 28 మంది శ్రీకాకుళం జాలర్లు... రంగంలోకి చంద్రబాబు

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 8:22 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 మంది జాలర్లను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జల్లాలకుచెందిన 28 మంది జాలర్లు చేపల వేటను జీవనోపాధిగా చేసుకుని జీవిస్తుూ గుజరాత్ వలస వెళ్లారు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 మంది జాలర్లను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జల్లాలకుచెందిన 28 మంది జాలర్లు చేపల వేటను జీవనోపాధిగా చేసుకుని జీవిస్తుూ గుజరాత్ వలస వెళ్లారు..

బుధవారం అరేబియా సముద్ర తీరంలో చేపలు పట్టేందుకు నాలుగు బోట్లలో వెళ్లిన 28 మంది దారి తప్పి పాక్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్‌ గార్డ్ వారిని అదుపులోకి తీసుకుంది. ఈ వార్త తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాలర్లను విడిపించేందుకు రంగంలోకి దిగారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మత్య్సకారులను విడిపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయన ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడారు.

పాక్ విదేశీ మంత్రిత్వ శాఖకు మన అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు.. జాలర్లను శుక్రవారం నాటికి కరాచీకి తరలిస్తారని...పట్టుబడిన జాలర్లను సాధ్యమైనంత త్వరంగా ఆంధ్రప్రదేశ్‌‌కు తరలిస్తామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. మరోవైపు తమ వారి క్షేమ సమాచారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 
 

click me!