జగన్ ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడుతున్నాయ్: మురళీమోహన్

Published : Nov 29, 2018, 08:00 PM IST
జగన్ ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడుతున్నాయ్: మురళీమోహన్

సారాంశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ సెటైర్లు వేశారు. ఏలూరులో పర్యటించిన మురళీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కోడి కత్తి పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు.   

ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ సెటైర్లు వేశారు. ఏలూరులో పర్యటించిన మురళీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కోడి కత్తి పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. 

తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని మురళీమోహన్ ఆరోపించారు. సుమారు 18 కేసుల్లో జగన్ ఏ-1 ముద్దాయిగా ఉన్నారని చెప్పారు. జైల్లో కూడా ఉండి వచ్చారని ఆ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. 

ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌తో జత కలిశామని వివరించారు. ఏపీలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందో లేదోనన్న విషయం మరికొద్ది రోజుల్లో స్పష్టం అవుతుందన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu