నేను ఉదయిస్తున్న తరాలకు ప్రతినిధిని: పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Nov 29, 2018, 5:13 PM IST
Highlights

తాను ఉదయిస్తున్న తరాలకు ప్రతినిధినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లా వెన్నునోటు రాజకీయాలు తనకు తెలియవని చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న పవన్ చేనేత కళాకారులతో సమావేశమయ్యారు. 
 

అమలాపురం: తాను ఉదయిస్తున్న తరాలకు ప్రతినిధినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లా వెన్నునోటు రాజకీయాలు తనకు తెలియవని చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న పవన్ చేనేత కళాకారులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చేనేత కళ చాలా గొప్ప అరుదైన కళ అని కొనియాడారు. చేనేత గొప్పతనాన్ని తెలపడానికే తాను పంచె కడుతున్నట్టు స్పష్టం చేశారు. కులం పేరుతో గెలిచిన నాయకులు న్యాయం చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లేవన్నారు. 2019 ఫిబ్రవరిలో చేనేత కార్మికులతో భారీ సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.    

మరోవైపు టీడీపీ, వైసీపీలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబులా తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని ఎద్దేవా చేశారు. నీతివంతమైన పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. ఎవరు తప్పుచేసినా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. చివరకు తాను తప్పు చేసినా ప్రజలు తన చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు. 

నేతన్నల సంక్షేమం జనసేనతోనే సాధ్యమని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

click me!