కొత్తగా 2,783 మందికి కరోనా: ఏపీలో 8.23 లక్షలకు చేరిన కేసులు

By Siva KodatiFirst Published Oct 31, 2020, 5:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 82,045 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,783 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 82,045 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,783 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది.

నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కోవిడ్ కారణంగా 14 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,690కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,575 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 3,708 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో డిశ్చార్జ్‌ల సంఖ్య 7,92,083కి చేరుకుంది. నిన్నటి కలిపి ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 80,28,905కి చేరింది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 170, చిత్తూరు 351, తూర్పు గోదావరి 371, గుంటూరు 324, కడప 169, కృష్ణ 425, కర్నూలు 34, నెల్లూరు 86, ప్రకాశం 134, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 113, విజయనగరం 70, పశ్చిమ గోదావరిలలో 469 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు, కృష్ణలలో ముగ్గురు చొప్పున.. గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరిలలో ఒక్కరు చొప్పున మరణించారు. 

 

 

: 31/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,20,453 పాజిటివ్ కేసు లకు గాను
*7,89,188 మంది డిశ్చార్జ్ కాగా
*6,690 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,575 pic.twitter.com/HehL6l1Wfm

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!