ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు.. నాలుగు జిల్లాల్లో తగ్గని తీవ్రత

Siva Kodati |  
Published : Jul 17, 2021, 05:58 PM ISTUpdated : Jul 17, 2021, 05:59 PM IST
ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు.. నాలుగు జిల్లాల్లో తగ్గని తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదవ్వగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,467 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,041 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,672 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,34,227కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,115కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 3, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, అనంతపురం 2 , పశ్చిమగోదావరి 3, కృష్ణ 1, గుంటూరు 1, నెల్లూరు 1, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,467 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,96,071కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,594 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,34,88,031కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,041 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 73, చిత్తూరు 372, తూర్పుగోదావరి 504, గుంటూరు 225, కడప 149, కృష్ణ 257, కర్నూలు 21, నెల్లూరు 288, ప్రకాశం 315, శ్రీకాకుళం 35, విశాఖపట్నం 111, విజయనగరం 30, పశ్చిమ గోదావరిలలో 292 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  


 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu