ఏపీ: కృష్ణా జిల్లాలో అనూహ్యంగా పెరిగిన మరణాలు.. రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు

Siva Kodati |  
Published : Aug 06, 2021, 05:45 PM ISTUpdated : Aug 06, 2021, 05:46 PM IST
ఏపీ: కృష్ణా జిల్లాలో అనూహ్యంగా పెరిగిన మరణాలు.. రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1896 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,593 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,209 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,75,455కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,490కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ప్రకాశం 2, అనంతపురం 2, తూర్పుగోదావరి 1, కడప 1, శ్రీకాకుళం 1, చిత్తూరు 3, కృష్ణ 6, గుంటూరు 4, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1896 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,41,372కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 81,505 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,50,27,770కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,593 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 34, చిత్తూరు 382, తూర్పుగోదావరి 438, గుంటూరు 183, కడప 65, కృష్ణ 243, కర్నూలు 27, నెల్లూరు 307, ప్రకాశం 184, శ్రీకాకుళం 41, విశాఖపట్నం 135, విజయనగరం 30, పశ్చిమ గోదావరిలలో 140 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  

 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu