ఏపీలో తగ్గని కరోనా తీవ్రత: కొత్తగా 22,018 కేసులు.. తూర్పు గోదావరిలో పైపైకి

Siva Kodati |  
Published : May 14, 2021, 05:59 PM IST
ఏపీలో తగ్గని కరోనా తీవ్రత: కొత్తగా 22,018 కేసులు.. తూర్పు గోదావరిలో పైపైకి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల తీవ్రత పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,018 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 13,88,803కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 96 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9,173కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 8, గుంటూరు 7, కర్నూలు 6, నెల్లూరు 7, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళంలో 6, పశ్చిమ గోదావరి 10, కడపలో నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 19,177 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 11,75,843కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 89,087 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,77,91,120కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2213, చిత్తూరు 2708, తూర్పుగోదావరి 3432, గుంటూరు 1733, కడప 1460, కృష్ణ 1031, కర్నూలు 1213, నెల్లూరు 1733, ప్రకాశం 1265, శ్రీకాకుళం 695, విశాఖపట్నం 2200, విజయనగరం 899, పశ్చిమ గోదావరిలలో 1463 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలకు 6 రోజులు వర్ష గండం.. ఐఎండీ అలర్ట్
Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు