వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

By narsimha lodeFirst Published May 14, 2021, 5:10 PM IST
Highlights

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును శుక్రవారం నాడు ఏపీ సీఐడీ పోలీసులు  అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును శుక్రవారం నాడు ఏపీ సీఐడీ పోలీసులు  అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను 124 ఐసీసీ-ఏ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.  హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణం రాజు ఇంట్లో సీఐడీ పోలీసులు  ఆయనను అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నుండి ఎంపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. 

సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణమ రాజు వాగ్వివాదానికి దిగారు. సెక్యూరిటీ సిబ్బంది రఘురామ కృష్ణమ రాజు చుట్టూ వలయంగా ఏర్పడి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయడానికి అనుమతించబోమని వారు చెప్పారు. రఘురామకృష్ణమ రాజును అరెస్టు మంగళగిరి సిఐడి కార్యాలయానికి తరలిస్తున్నట్లు నట్లు తెలుస్తోంది.

తమ తండ్రిని ఎందుకు అరెస్టు చేశారో కారణం చెప్బలేదని రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్ అన్నారు. రఘురామ ఆరోగ్యం బాగా లేదని ఆయన అన్నారు. వారంట్ ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆయన అన్నారు. రఘురామ కృష్ణమ రాజును ఎటు తీసుకుని వెళ్తున్నారో కూడా తెలియదని ఆయన అన్నారు. వైృ కెటగిరీ సెక్యూరిటీని పక్కకు తోసేసి అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. 

రఘురామ కృష్ణమ రాజు అరెస్టుపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ కృష్ణమ రాజు అరెస్టుకు సంబంధించిన నోటీసును తీసుకోవడానికి ఆయన భార్య తీసుకోలేదని, దాంతో దాన్ని ఇంటికి అతికించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేలా రఘురామ కృష్ణమ రాజు వ్యవహరించారని కేసు నమోదు చేశారు. అదే సమయంలో కుట్ర కోణంలో కూడా కేసు నమెదు చేసినట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల సమయంలో నర్సాపురం ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. గత  ఏడాదిలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ తో అంతరం పెరిగింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని  వైసీపీ లోక్‌సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.  అప్పటి నుండి ఏపీలో వైసీపీ ప్రభుత్వం,సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

వైసీపీతో అంతరం పెరిగిన తర్వాత  కేంద్ర ప్రభుత్వం  రఘురామకృష్ణంరాజుకు రక్షణను కల్పించింది. ఏపీ ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉందని  కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో  కేంద్రం ఆయనకు రక్షణ కల్పించింది. ఎంపీకి రక్షణగా ఉన్న సెక్యూరిటీకి చెందిన ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత  ఏపీ సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. 


 

click me!