తాడిపత్రిలో రాళ్లదాడి: 22 మందిపై కేసులు.. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల వద్ద భారీ భద్రత

By Siva KodatiFirst Published Dec 25, 2020, 4:40 PM IST
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రి రాళ్లదాడికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. నిన్న రాళ్ల దాడిలో మనోజ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి

అనంతపురం జిల్లా తాడిపత్రి రాళ్లదాడికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. నిన్న రాళ్ల దాడిలో మనోజ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

అయితే సీసీ ఫుటేజ్ వున్నా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి ఆయన అనుచరులపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేశారు. దీంతో జేసీ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అనంతరం పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి ఇరు వర్గాలు. ఈ ఘటనలో జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇసుక రవాణాకు సంబంధించి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Also Read:తాడిపత్రి ఘటన: జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు ఫోన్

దీంతో వివాదం చెలరేగింది. మరోవైపు తాడిపత్రిలో పరిస్ధితి అదుపులోనే వుందన్నారు డీఎస్పీ. ప్రస్తుతం 144 సెక్షన్, 30 యాక్ట్ కొనసాగుతోందని చెప్పారు. కాశీ, బ్రహ్మయ్య, మనోజ్ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 22 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

ఆడియో టేపుల పోస్టింగ్‌లో వలీ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులపై సుమోటాగా కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భద్రత పెంచారు పోలీసులు. 

click me!