తూగో జిల్లాలో కరోనా కలకలం... 22మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు పాజిటివ్

By Arun Kumar PFirst Published Jul 17, 2020, 12:15 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విశ్వరూపం దాలుస్తోంది. తాజాగా ఎటపాక 212 సీఆర్పీఎఫ్ క్యాంపులో 18 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విశ్వరూపం దాలుస్తోంది. తాజాగా ఎటపాక 212 సీఆర్పీఎఫ్ క్యాంపులో 18 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే నలుగురు జవాన్లకు కరోనా సోకగా తాజాగా వెలువడిన కేసులతో కలిపి సీఆర్పీఎఫ్ క్యాంపులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22కు చేరింది. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 38 వేలు దాటగా, మరణాలు 500కు చేరువయ్యాయి. కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో కరోనా విలయతాండం చేస్తోంది. రెండు జిల్లాల్లోనే గత 24 గంటల్లో వేయికి పైగా కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం 2,593 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 38,044కు చేరుకుంది. ఏపీకి చెందినవారిలో గత 24 గంటల్లో 2584 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 9 మందికి కోవిడ్ -19 సోకింది. 

read more   సత్తెనపల్లిలో విషాదం: కరోనాతో కళ్ల ముందే తల్లి మృతి, తీవ్ర అస్వస్థతతో తండ్రి

 ఏపీలో 40 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య492కు చేరుకుంది.  తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు మరణించారు.  అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి చనిపోయారు. 

 చిత్తూరు జిల్లాలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 174, తూర్పు గోదావరి జిల్లాలో 500, గుంటూరు జిల్లాలో 139  కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 126, కృష్ణా జిల్లాలో 132, కర్నూలు జిల్లాలో 590,  నెల్లూరు జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో 104, శ్రీకాకుళం జిల్లాలో 111, విశాఖపట్నం జిల్లాలో 84, విజయనగరం జిల్లాలో 101, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 195 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం ఇప్పటి వరకు 2453 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో 432 మందికి కరోనా వైరస్ సోకింది. 

click me!