ఏపీలో రూటుమార్చిన మందుబాబులు... శానిటైజర్ తాగి హల్ చల్

By Arun Kumar PFirst Published Jul 17, 2020, 11:36 AM IST
Highlights

కరోనా నియంత్రణకు ఉపయోగించే శానిటైజర్ లో ఆల్కహాల్ వుంటుందని తెలుసుకున్న మందుబాబులు దాన్ని లాగించేసి కిక్కులో మునిగితేలుతున్నారు. 
 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మద్యపాన నిషేదంలో భాగంగా మద్యం ధరలను భారీగా పెంచింది జగన్ ప్రభుత్వం. అంతేకాకుండా దశలవారిగా వైన్ షాపుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. దీంతో భారీగా డబ్బులు పెట్టి మద్యం కొనలేక మందుబాబులు కిక్కు కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కరోనా నియంత్రణకు ఉపయోగించే శానిటైజర్ లో ఆల్కహాల్ వుంటుందని తెలుసుకున్న మందుబాబులు దాన్ని లాగించేసి కిక్కులో మునిగితేలుతున్నారు. 

ఇలా విజయవాడలో మందుబాబులు హల్ చల్ చేస్తున్నారు. పాతబస్తీలో రోడ్లపైన, కొండ ప్రాంతాల్లో  శానిటైజర్ ను తాగి కిక్కు ను ఆస్వాదిస్తున్నారు. కేవలం 50 రూపాయలకే శానిటైజర్ లభిస్తుండటంతో  విచ్చలవిడిగా సేవిస్తున్నారు మందుబాబులు. శానిటైజర్ లో ఆల్కహాల్ ఉంటుందన్న భావనతో ఇష్టానుసారంగా శానిటైజర్లు కొనుగోలు చేస్తున్నారు. 

read more  సత్తెనపల్లిలో విషాదం: కరోనాతో కళ్ల ముందే తల్లి మృతి, తీవ్ర అస్వస్థతతో తండ్రి

అయితే ఇలా శానిటైజర్ సేవించడం వల్ల ఆరొగ్యం పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మాటలను పట్టించుకోకుండా మందుబాబులు కిక్కు కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్దమయ్యారు. వద్దని వారిస్తున్నా వారిపైన కొట్లాటకు దిగుతున్నారు. తమను గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ల నుండే కాకుండా ఈ శానిటైజర్ బ్యాచ్ నుంచి కాపాడాలని కోరుతున్నారు పాతబస్తీలోని గొల్లపాలెం గట్టు వాసులు. 

click me!