ఏపీ: మళ్లీ స్వల్పంగా పెరిగిన మరణాలు.. రాష్ట్రంలో కొత్తగా 2,145 కరోనా కేసులు

Siva Kodati |  
Published : Aug 05, 2021, 06:07 PM IST
ఏపీ: మళ్లీ స్వల్పంగా పెరిగిన మరణాలు.. రాష్ట్రంలో కొత్తగా 2,145 కరోనా కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదవ్వగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,003 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,302 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,73,246కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,468కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ప్రకాశం 5, అనంతపురం 1, తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, కృష్ణ 4, గుంటూరు 1, విశాఖపట్నం 1, కడప 3, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,003 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,39,476కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 85,822 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,49,46,265కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,302 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 36, చిత్తూరు 369, తూర్పుగోదావరి 428, గుంటూరు 181, కడప 103, కృష్ణ 251, కర్నూలు 54, నెల్లూరు 304, ప్రకాశం 160, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 89, విజయనగరం 28, పశ్చిమ గోదావరిలలో 108 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?