వివాహితపై మోజు: అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jul 28, 2019, 05:15 PM IST
వివాహితపై మోజు: అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య

సారాంశం

ఓ మహిళ తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఓ మహిళ తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య అనే యువకుడు కూలిపనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో తన ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్న.. వరుసకు బంధువయ్యే వివాహితను ఇష్టపడ్డాడు. శనివారం మధ్యాహ్నం సదరు మహిళను కలిసి తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని మనసులోని మాటను చెప్పాడు.

అందుకు ఆమె ససేమిరా అనడంతో రమణయ్య మనస్తాపం చెందాడు.  వెంటనే ఇంటికి వచ్చి విషపు గుళికలను మింగాడు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు యువకుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu
Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu