గరుడ శివాజీ వెనుక చంద్రబాబు... ఇద్దరు కలిసి బీజేపీపై కుట్ర: కన్నా

Siva Kodati |  
Published : Jul 28, 2019, 03:27 PM IST
గరుడ శివాజీ వెనుక చంద్రబాబు... ఇద్దరు కలిసి బీజేపీపై కుట్ర: కన్నా

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... గరుడ పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... గరుడ పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు.

ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.

ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించి నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం చేసిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.

ఎన్నికల్లో  లబ్ధిపొందేందుకే చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని.. అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కుటుంబం కుప్పకూలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీతో పాటు దేశమంతా బీజేపీవైపు చూస్తోందని.. యువత పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని కన్నా స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్