కారులో కూర్చొని.. డ్రైవర్‌తో లంచం అడిగిస్తూ: బ్రేక్ ఇన్స్‌పెక్టర్ లీలలు

Siva Kodati |  
Published : Jul 28, 2019, 03:17 PM IST
కారులో కూర్చొని.. డ్రైవర్‌తో లంచం అడిగిస్తూ: బ్రేక్ ఇన్స్‌పెక్టర్ లీలలు

సారాంశం

ప్రకాశం జిల్లా కందుకూరులో ఓ బ్రేక్ ఇన్స్‌పెక్టర్ లంచం తీసుకుంటూ జనానికి అడ్డంగా దొరికిపోయారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ కిరణ్‌ ను వాహనదారులు అడ్డుకున్నారు.

ఇన్స్‌పెక్టర్ కారులో కూర్చొని.. డ్రైవర్‌తో వాహనదారుల నుంచి లంచాలు వసూలు చేయిస్తున్నారని జనం ఆరోపించారు. గొర్రెల లోడ్‌ తీసుకెళ్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద లైసెన్స్ ఉన్నప్పటికీ రూ.1,500 లంచం తీసుకున్నారు.

ఈ తతంగాన్ని వీడియో తీస్తుండగా ఇన్స్‌పెక్టర్ డ్రైవర్ సెల్‌ఫోన్ లాక్కొని విసిరి కొట్టాడని మండిపడుతున్నారు. దీంతో వాహనదారులు నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్