ఏపీలో కోవిడ్ ఉద్ధృతి: కొత్తగా 20,345 కేసులు.. చిత్తూరు, విశాఖలలో భయానకం

Siva Kodati |  
Published : May 11, 2021, 05:00 PM IST
ఏపీలో కోవిడ్ ఉద్ధృతి: కొత్తగా 20,345 కేసులు.. చిత్తూరు, విశాఖలలో భయానకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది . ఓరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ వైరస్‌ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల సంఖ్యలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,345 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 13,22,934 కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,899కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 10, అనంతపురం 5, తూర్పుగోదావరి 10, పశ్చిమ గోదావరి 5, చిత్తూరు 18, గుంటూరు 10, కర్నూలు 5, నెల్లూరు 8, కృష్ణ 7, ప్రకాశం 9, విశాఖపట్నం 12, శ్రీకాకుళంలో ఆరుగురు, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 14,502 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 11,18,933కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 86,878 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,75,14,937కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1992, చిత్తూరు 2426, తూర్పుగోదావరి 1527, గుంటూరు 1919, కడప 1902, కృష్ణ 948, కర్నూలు 707, నెల్లూరు 1673, ప్రకాశం 1130, శ్రీకాకుళం 1457, విశాఖపట్నం 2371, విజయనగరం 744, పశ్చిమ గోదావరిలలో 1549 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Heavy Rain Alert!: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు భారీ వర్షాలు| Asianet News Telugu