ప్రేమిస్తున్నానంటూ నమ్మించి.. బాలికను గర్భవతిని చేసి..

Published : May 11, 2021, 03:08 PM IST
ప్రేమిస్తున్నానంటూ నమ్మించి.. బాలికను గర్భవతిని చేసి..

సారాంశం

అతని కారణంగా  బాలిక గర్భం దాల్చింది. తీరా గర్భం దాల్చిన తర్వాత.. పెళ్లి చేసుకోమంటే కాదు పొమ్మన్నాడు. 

ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా బాలికను వాడుకున్నాడు. అతని కారణంగా  బాలిక గర్భం దాల్చింది. తీరా గర్భం దాల్చిన తర్వాత.. పెళ్లి చేసుకోమంటే కాదు పొమ్మన్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాళ్లపాలెం పంచాయతీ శివారు చింతలమూరుకి చెందిన దళిత మైనర్‌ బాలిక(17)ను సానారుద్రవరానికి చెందిన గంగుల జగదీష్‌(22) అనే యువకుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భవతిని చేశాడని పోలీసులు తెలిపారు. ఎస్సీకి చెందిన నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు అంటూ జగదీష్‌ ఇప్పుడు నిరాకరిస్తున్నాడని బాలిక తల్లి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఎస్‌ఐ జనార్థన్‌ ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని, డీఎస్పీ సత్యానందం కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu