తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురేలేదు, ఏపీలో క్లీన్ స్వీప్ చేసే పార్టీ అదే.: కేఏ పాల్ జోస్యం

By Nagaraju TFirst Published Jan 30, 2019, 8:00 PM IST
Highlights

చంద్రబాబుకి కేసీఆర్‌ ఇస్తానన్న రిటర్న్‌ గిఫ్ట్‌ మాట నెరవేరుతుందని పాల్ జోస్యం చెప్పారు. ఎన్నికలకు మరో 90 రోజులు సమయం ఉందని ఇప్పటికే 100 సీట్లలో తమకు గెలుపు ఖాయమైందన్నారు. 
 

హైదరాబాద్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు విమర్శల దాడి పెంచుతున్నాయి. కొన్ని పార్టీలైతే తామే అధికారంలోకి వస్తామని తమకు ఎదురేలేదని అంచనాల్లో తేలుపోతున్నాయి. 

అలాంటి పార్టీలలో ప్రజాశాంతి పార్టీ ఒకటి. ఏపీలో ప్రజా శాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ లేదని, అలాగే ఏపీలో ప్రజాశాంతి పార్టీకి ఎదురే ఉండదన్నారు. 

టీడీపీ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. చంద్రబాబుకి కేసీఆర్‌ ఇస్తానన్న రిటర్న్‌ గిఫ్ట్‌ మాట నెరవేరుతుందని పాల్ జోస్యం చెప్పారు. ఎన్నికలకు మరో 90 రోజులు సమయం ఉందని ఇప్పటికే 100 సీట్లలో తమకు గెలుపు ఖాయమైందన్నారు. 

గట్టిగా కృషి చేస్తే 175కి 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీకి సంబంధించి ఎలాంటి కమిటీలు నియమించలేదన్నారు. పార్టీలో చేరికలు మరింత పుంజుకోనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ దొబ్బేసిన లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరుతాయి : కేఏ పాల్

click me!