దారుణం చేపలకోసం వెడితే..మింగేసిన ఊబి...ఇద్దరు మృతి..!

Published : Jul 08, 2021, 01:19 PM IST
దారుణం చేపలకోసం వెడితే..మింగేసిన ఊబి...ఇద్దరు మృతి..!

సారాంశం

పశ్చిమగోదావరి : చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ఓ బాలిక, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా, జీలుగు మిల్లి సమీపంలోని బుడుగల చెరువులో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. 

జీలుగుమిల్లి మండలం వంకావారిగూడేనికి చెందిన ఎం. కల్యాణి(15) ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుండగా, తెలంగాణ రాష్ట్రం కొత్త గూడెం-భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రామిరెడ్డి గూడేనికి చెందిన ఎం. మహాలక్ష్మి (31) ఉపాధి పనుల కోసం వంకావారి గూడేనికి వచ్చింది. 

వర్షాలు బాగా పడుతుండటంతో స్థానికులతో కలిసి వీరు జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులోకి దిగి వలతో చేపలు పడుతూ ముందుకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఊబిలో చిక్కుకుని మృతి చెందారు. 

వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్