ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా నాన్నా!: వైఎస్సార్ జయంతిన జగన్ భావోద్వేగం

By Arun Kumar PFirst Published Jul 8, 2021, 1:05 PM IST
Highlights

వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ కవితాత్మక పోస్ట్ పెట్టారు సీఎం జగన్. 

కడప: దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ కవితాత్మక పోస్ట్ పెట్టారు జగన్. 

''చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన  బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా'' అంటూ తండ్రికి భావోద్వేగంతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. 

read more  రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు

వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు సీఎం జగన్. ఇవాళ అమరావతి నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్నారు జగన్. అక్కడి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలను ముగించుకుని మద్యాహ్నం 3.40 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. 

ఇప్పటికే వైఎస్సార్‌ ఘాట్ వద్ద జగన్ భార్య  వైఎస్‌ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిల  కూడా నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.   

click me!