ఏపీలో 2 లక్షల గంజాయి సీజ్:2021 ఎన్సీబీ నివేదిక

By narsimha lode  |  First Published Sep 29, 2022, 11:11 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గంజాయిని అత్యధికంగా సీజ్ చేసినట్టుగా ఎన్ సీ బీ నివేదిక వెల్లడించింది. 2021 ఎస్సీబీ నివేదిక ప్రకారంగా 2 లక్షల కిలోల గంజాయిని ఏపీలో సీజ్ చేశారు. ఏపీ తర్వాతి స్థానంలో ఒడిశా నిలిచింది. 


న్యూఢిల్లీ: గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా నార్కోటిక్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. దేశంలో గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచినట్టుగా ఈ నివేదిక వెల్లడిస్తుంది. 

గత ఏదాది దేశంలో సుమారు  7 లక్షల కిలోల గంజాయి సీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండే 50 శాతం ఉందని ఎన్సీబీ నివేదిక తెలిపింది. గత ఏడాది రెండు లక్షల కిలోల గంజాయిని ఏపీలో సీజ్ చేశారు. అంతేకాదు 18 కిలోల హష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై 1775 కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు గంజాయి సరఫరా చేస్తూ 4,202 మంది పట్టుబడ్డారు. 

Latest Videos

undefined

మరోవైపు హెరాయి కేసుల్లో గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలో 7618 కిలోల హెరాయిన్ ను  గత ఏడాది పట్టుకున్నారు. అయితే గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా 3,334 కిలోలు గుజరాత్ లోనే పట్టుబడింది. గుజరాత్ తర్వాత హెరాయిన్ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. యూపీలో 1337 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు అధికారులు. నార్కోటిక్స్ బ్యూరో 2021 నివేదికను ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. 

గత ఏడాది తెలంగాణలో 35,270 కిలోల గంజాయి ని సీజ్ చేశారు. పంజాబ్ లో అత్యధికంగా మత్తు పదార్ధాల ప్రభావం ఉన్నట్టుగా ఎన్సీబీ నివేదిక తెలుపుతుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.  దేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుండి గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖపట్టణం నుండి గంజాయి తరలిస్తూ గతంలో పలువురు పట్టుబడిన కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

click me!