చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు

Published : Jan 08, 2020, 07:24 AM ISTUpdated : Jan 08, 2020, 08:32 AM IST
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు

సారాంశం

చిత్తూరు జిల్లా కాసిపెంట్ల వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి.


చిత్తూరు జిల్లా కాసీపేట వద్ద  పూతలపట్టు రహదారి పై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
 మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు ఆస్పత్రికి తరలించారు మరో 30 మంది చెప్పారు 

నల్గొండ జిల్లా డిండి నుండి 30 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ బస్సులో 23 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. మరో ఏడుగురు మాత్రం అయ్యప్ప భక్తులు కాదు. 

అయ్యప్ప భక్తులు బుధవారం నాడు ఉదయం తిరుమలకు చేరుకొని వెంకన్నను దర్శించుకోవాల్సి ఉంది. కాసీపేట వద్ద ప్రమాదం చోటు చేసుకొంది. అమరావతికి వెళ్లే బస్సు ను ప్రైవేట్ బస్సు  ఢీకొట్టింది. మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రికి 30 మందిని తరలించారు. అమరావతి బస్సులో ఉన్నవారికి స్వల్పగాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరిద్దరూ మినహ మిగిలినవారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు