శ్రీగౌతమి కేసు: కారుతో ఢీకొట్టిన మరో ఇద్దరి అరెస్ట్

First Published Jul 10, 2018, 5:39 PM IST
Highlights

శ్రీగౌతమి హత్య కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులుప్రకటించారు. మొత్తంగా ఇప్పటివరకు ఏడు మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కారుతో ఢీకొట్టి శ్రీగౌతమి మరణానికి కారణమైన సందీప్, దుర్గాప్రసాద్ లను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.


ఏలూరు:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన శ్రీగౌతమి హత్య కేసులో  మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.  విశాఖకు చెందిన సందీప్, దుర్గాప్రసాద్‌లు శ్రీగౌతమిని కారుతో ఢీకొట్టి చంపేశారు.వీరిద్దరి అరెస్ట్ తో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరుకొంది.

గత ఏడాది జనవరి 18వ తేదీన  శ్రీగౌతమిని సందీప్, దుర్గాప్రసాద్‌లు తమ టాటా సఫారీ వాహానంతో ఢీకొట్టి చంపేశారు.  రోడ్డు ప్రమాదంలో  శ్రీగౌతమి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే  శ్రీ గౌతమి  సోదరి పావని చేసిన పోరాటంతో శ్రీగౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని హత్య చేశారని తేలింది. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఇటీవల ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

అయితే కారుతో ఢీకొట్టిన దుర్గాప్రసాద్, సందీప్‌లను అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో మొదట ఎనిమిది మంది నిందితులకు సంబందమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్‌, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విదితమే. దీంతో వారిద్దరి బెయిల్‌ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్‌లుగా కేసు మార్పు చేసిన విషయం తెలిసిందే.

click me!