భారీగా తగ్గుదల.. కొత్తగా 199 కేసులు: ఏపీలో 8,81,794కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 09, 2021, 06:31 PM ISTUpdated : Jan 09, 2021, 11:49 PM IST
భారీగా తగ్గుదల.. కొత్తగా 199 కేసులు: ఏపీలో 8,81,794కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50,445 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50,445 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 8,81,794 కి చేరింది. కోవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఒక్కరు మరణించడంతో.. రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 7,128 కి చేరింది.

గడచిన 24 గంటల్లో 423 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,74,954కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 2,607 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న చేసిన టెస్టులతో కలిపి ఏపీలో పరీక్షల సంఖ్య 1,22,74,647కి చేరుకుంది.

అనంతపురం 15, చిత్తూరు 23, తూర్పుగోదావరి 20, గుంటూరు 35, కడప7, కృష్ణ 35, కర్నూలు 12, నెల్లూరు 11, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 21, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 14 కేసులు నమోదయ్యాయి. 
 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్