ఏపీలో స్వల్పంగా తగ్గిన కేసులు: కొత్తగా 1869 మందికి పాజిటివ్.. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Aug 11, 2021, 04:55 PM IST
ఏపీలో స్వల్పంగా తగ్గిన కేసులు: కొత్తగా 1869 మందికి పాజిటివ్.. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు నమోదవ్వగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2316 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,417 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1869 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,84,156కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,582కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 1, చిత్తూరు 5, కృష్ణ 3, ప్రకాశం 3, గుంటూరు 2, అనంతపురం 1, నెల్లూరు 1, విశాఖ పట్నం 1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2316 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,52,157కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 71,030 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,53,82,763కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,417 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 51, చిత్తూరు 175, తూర్పుగోదావరి 385, గుంటూరు 222, కడప 133, కృష్ణ 148, కర్నూలు 10, నెల్లూరు 177, ప్రకాశం 98, శ్రీకాకుళం 82, విశాఖపట్నం 63, విజయనగరం 21, పశ్చిమ గోదావరిలలో 304 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP