కృష్ణాలో ఉద్ధృతి.. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, 20,70,014కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Nov 30, 2021, 06:46 PM IST
కృష్ణాలో ఉద్ధృతి.. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, 20,70,014కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 134 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,149 మంది చికిత్స పొందుతున్నారు


ఆంధ్రప్రదేశ్‌‌‌లో  (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 184 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,70,014కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,442కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 134 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,53,423కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 25,925 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,04,17,082కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,149 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 9, చిత్తూరు 30, తూర్పుగోదావరి 17, గుంటూరు 15, కడప 3, కృష్ణ 34, కర్నూలు 3, నెల్లూరు 7, ప్రకాశం 8, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 26, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 21 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

dhulipalla narendra ఘనంగా ధూళిపాళ్ల కుమార్తె వివాహం హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎం లు | Asianet Telugu
కుప్పంలో మెగా జాబ్ మేళాలో పాల్గొన్న నారా భువనేశ్వరి| Asianet News Telugu