కొత్తగా 181 మందికి పాజిటివ్.. ఏపీలో 20,71,322కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Dec 08, 2021, 08:20 PM IST
కొత్తగా 181 మందికి పాజిటివ్.. ఏపీలో 20,71,322కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 181 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 176 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,011 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 181 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,71,322కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,457కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 176 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,54,854కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,957 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,06,51,512కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,011 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 9, చిత్తూరు 34, తూర్పుగోదావరి 15, గుంటూరు 21, కడప 3, కృష్ణ 21, కర్నూలు 0, నెల్లూరు 8, ప్రకాశం 10, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 32, విజయనగరం 5, పశ్చిమ గోదావరిలలో 14 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్