లాక్ డౌన్ సడలింపు ఎఫెక్ట్: ఏపీలో ఒక్క రోజులో 180 కరోనా కేసులు, నలుగురు మృతి

Published : Jun 03, 2020, 12:23 PM ISTUpdated : Jun 03, 2020, 12:24 PM IST
లాక్ డౌన్ సడలింపు ఎఫెక్ట్: ఏపీలో ఒక్క రోజులో 180 కరోనా కేసులు, నలుగురు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై లాక్ డౌన్ సడలింపుల ప్రభావం ముమ్మరంగా పడుతోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారి వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి కరళా నృత్యం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారి వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తూ వస్తోంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 180 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మరణించారు. 

 గత 24 గంటల్లో ఇతర రాష్ట్రాల నంచి వచ్చినవారిలో 94 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి కరోనా వైరస్ వచ్చినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 68 మంది మరణించారు. 

ఏపీలో 967 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 2224 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరుకుంది. 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,066 శాంపిల్స్ ను పరీక్షించగా 79 మందికి మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.  గత 24 గంటల్లో 35 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసుల్లో 118 యాక్టివ్ గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 573 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వీరిలో 362 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?