కొత్తగా 175 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,91,563కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Mar 13, 2021, 07:40 PM IST
కొత్తగా 175 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,91,563కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల నిలకడగా వుంది. నిన్న 200 వందలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 175 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల నిలకడగా వుంది. నిన్న 200 వందలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 175 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,91,563కి చేరుకుంది. కరోనా వల్ల నిన్న అనంతపురం, చిత్తూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 7,182కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,268 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 132 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,83,113కి చేరుకుంది. నిన్న రాష్ట్రంలో 40,448 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,44,89,098కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 7, చిత్తూరు 40, తూర్పుగోదావరి 31, గుంటూరు 15, కడప 9, కృష్ణా  24, నెల్లూరు 5, కర్నూలు 0, ప్రకాశం 9, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 20, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 


 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?