ఏపీ: కొత్తగా 1746 మందికి పాజిటివ్.. 19,87,761కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 13, 2021, 08:13 PM IST
ఏపీ: కొత్తగా 1746 మందికి పాజిటివ్.. 19,87,761కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1746 కరోనా కేసులు నమోదవ్వగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1648 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,766 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1746 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,87,761కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,615కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, నెల్లూరు 3, కృష్ణ 2, శ్రీకాకుళం 2, అనంతపురం 1, గుంటూరు 1, పశ్చిమ గోదావరి 1, విశాఖపట్నంలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1648 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,55,380కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 73,341 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,55,26,861కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,766 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 27, చిత్తూరు 203, తూర్పుగోదావరి 304, గుంటూరు 160, కడప 78, కృష్ణ 125, కర్నూలు 20, నెల్లూరు 236, ప్రకాశం 106, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 115, విజయనగరం 20, పశ్చిమ గోదావరిలలో 261 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu