ఏపీకి భారీ ఊరట: 15 వందలకు పడిపోయిన కరోనా కేసులు, తూర్పుగోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Jul 12, 2021, 06:23 PM ISTUpdated : Jul 12, 2021, 06:26 PM IST
ఏపీకి భారీ ఊరట: 15 వందలకు పడిపోయిన కరోనా కేసులు, తూర్పుగోదావరిలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1578 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోగా... 24 గంటల్లో 3,041 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 27,195 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌కు భారీ ఊరట లభించింది. కరోనా కేసులు 15 వందలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1578 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,21,526 చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,024కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 3, చిత్తూరు 3, గుంటూరు 3,  నెల్లూరు 3, ప్రకాశం 3, కృష్ణ 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 2, కర్నూలు 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,041 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,81,307కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 62,657 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,30,48,945 చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 27,195 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 37, చిత్తూరు 257, తూర్పుగోదావరి 305, గుంటూరు 97, కడప 117, కృష్ణ 92, కర్నూలు 35, నెల్లూరు 179, ప్రకాశం 173, శ్రీకాకుళం 31, విశాఖపట్నం 68, విజయనగరం 35, పశ్చిమ గోదావరిలలో 152 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

మార్కాపురం ప్రమాదంపై మంత్రుల ప్రెస్ మీట్ | Markapuram Bus Incident | Asianet News Telugu
అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in Assembly