ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు.. 20,09,228కి చేరిన సంఖ్య: చిత్తూరు, తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : Aug 29, 2021, 05:32 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు..  20,09,228కి చేరిన సంఖ్య: చిత్తూరు, తూ.గోలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 1557 కరోనా కేసులు నమోదవ్వగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,213 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,825 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1557 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,09,228కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,825కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 3, తూర్పుగోదావరి 1, గుంటూరు 3, కృష్ణ 4, నెల్లూరు 3, ప్రకాశం 2, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,213 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,80,224కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 64,550మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,65,35,822కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,179మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 35, చిత్తూరు 255, తూర్పుగోదావరి 232, గుంటూరు 127, కడప 92, కృష్ణ 159, కర్నూలు 4, నెల్లూరు 164, ప్రకాశం 112, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 83, విజయనగరం 48, పశ్చిమ గోదావరిలలో 212 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?