ఏపీలో దిగివచ్చిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1546 మందికి పాజిటివ్, 19,68,659కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Aug 03, 2021, 05:54 PM ISTUpdated : Aug 03, 2021, 05:55 PM IST
ఏపీలో దిగివచ్చిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1546 మందికి పాజిటివ్, 19,68,659కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1546 కరోనా కేసులు నమోదవ్వగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1940 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,170 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1546 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,68,659కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,428కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, ప్రకాశం 1, కృష్ణ 3, గుంటూరు 2, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1940 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,35,061కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 69,606 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,47,78,146కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,170 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 30, చిత్తూరు 284, తూర్పుగోదావరి 83, గుంటూరు 130, కడప 14, కృష్ణ 259, కర్నూలు 26, నెల్లూరు 186, ప్రకాశం 185, శ్రీకాకుళం 55, విశాఖపట్నం 72, విజయనగరం 27, పశ్చిమ గోదావరిలలో 195 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu