డప్పు కొట్టిన రోజా: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Published : Aug 03, 2021, 05:09 PM IST
డప్పు కొట్టిన రోజా: సోషల్ మీడియాలో వీడియో వైరల్

సారాంశం

సినీ నటి రోజా డప్పు కొట్టి సందడి చేశారు. పుత్తూరు మండలంలో డప్పు కళాకారులకు డప్పులు అందించిన తర్వాత వారితో కలిసి ఆమె డప్పు కొట్టారు. 

అమరావతి: సినీ నటి, నగరి ఎమ్మెల్యే   డప్పు కొట్టి  సందడి చేశారు. ఎప్పడు ఏదో కార్యక్రమం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తుంటారు.  విపక్షంపై ఎదురు దాడి చేయడంలోనే కాదు  ప్రజలతో మమేకం కావడంలో ఆమెకు ఆమె సాటి అని ఆమె  అభిమానులు చెప్పుకొంటారు.పుత్తూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రోజా మంగళవారం నాడు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించారు. కళాకారులతో కలిసి ఆమె డప్పు వాయించి సందడి చేశారు. కళాకారులతో పోటీపడి ఆమె డప్పు వాయించే ప్రయత్నం చేశారు.డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె డప్పు వాయించారు. 

 పేద ప్రజలకు అండగా తమ ప్రభుత్వం ఉందని ఆమె చెప్పారు.  కుల వృత్తులను ఆదుకొనే దిశగా తమ ప్రభుత్వం తీసుకొంటుందన్నారు.  రోజా డప్పు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో ఆపరేషన్ చేయించుకొన్న రోజా కొంతకాలం వరకుత బెడ్ రెస్ట్ కే పరిమితమయ్యారు. ఇటీవలనే ఆమె తిరిగి  కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?