మైనర్ బాలిక శీలానికి వెల కట్టిన రాజకీయ నాయకుడు.. వినలేదని చితకబాదారు..

By AN TeluguFirst Published Nov 27, 2020, 9:21 AM IST
Highlights

పదిహేనేళ్ల బాలిక శీలానికి వెల కట్టిన హేయమైన సంఘటన అనంతపురంలో జరిగింది. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మాయమాటలతో మోసం చేసి, ఐదు రోజుల పాటు తిప్పుకుని ఆ తరువాత ఇంటి దగ్గర వదిలివెళ్లాడో ప్రబుద్ధుడు. దీనిమీద బంధువులు పోలీస్ స్టేషన్ కు వెడితే రూ. 30 వేలు ఇప్పిస్తానని రాజీ కుదిర్చాడో రాజకీయనాయకుడు. 

పదిహేనేళ్ల బాలిక శీలానికి వెల కట్టిన హేయమైన సంఘటన అనంతపురంలో జరిగింది. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మాయమాటలతో మోసం చేసి, ఐదు రోజుల పాటు తిప్పుకుని ఆ తరువాత ఇంటి దగ్గర వదిలివెళ్లాడో ప్రబుద్ధుడు. దీనిమీద బంధువులు పోలీస్ స్టేషన్ కు వెడితే రూ. 30 వేలు ఇప్పిస్తానని రాజీ కుదిర్చాడో రాజకీయనాయకుడు. అత్యంత దారుణమైన ఈ ఘటన పూర్తివివరాల్లోకి వెడితే.. 

బాధితుల కథనం మేరకు..శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన హరీష్‌ (30)అనే యువకుడు మాయమాటలతో తీసుకెళ్లిపోయాడు. దీంతో 20వ తేదీన ఆ బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత హరీష్‌ ఆ బాలికను కొన్నిరోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పి మదనపల్లె బస్టాండు వద్ద వదలి వెళ్లిపోయాడు. 

ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాలు చెప్పడంతో ఆ బాలిక బంధువులు, సోదరి టూటౌన్‌ పోలీసులకు తెలిపారు. బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి జీవితాన్ని నాశనం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో ఓ పార్టీ నేత వీరి వద్దకు వచ్చి జరిగిందేదో జరిగిపోయింది.. రూ.30వేలు ఇప్పిస్తా కేసు వాపస్ తీసుకో అంటూ బాలిక శీలానికి వెలకట్టి, రాజీ‘బేరం’చేశారు. 

ఇదిలా ఉంటే పోలీసులు బాలికను  బుధవారం తహశీల్దార్‌ ఎదుట హాజరుపరిచారు. ఇది తెలుసుకున్న హరీష్‌ మిత్రుడు, అప్పటికే రాజీ‘బేరం’ కుదిర్చిన నేత సోదరుడు మరికొందరితో కలిసి బుధవారం రాత్రి బాధితుల ఇంటిపై రాళ్లతో దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో పెద్ద రెడ్డెమ్మ(30), చిన్న రెడ్డెమ్మ(21) గాయపడ్డారు. దీంతో వారు గురువారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాలికను కిడ్నాప్‌ చేసి ఐదు రోజుల పాటు సోమలలో ఉన్నారని, దీనిపై స్థానిక నాయకుడొకరు పంచాయితీ చేసి, రాజీకి రాకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించడంతో స్టేషన్‌ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని వాపోయారు. ఆ విషయం బయట పెట్టినందుకు తమపై దాడి చేశారని, వీరి నుంచి ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. 

click me!