ఏపీలో కరోనా వ్యాప్తి: కొత్తగా వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు

By telugu teamFirst Published Nov 26, 2020, 6:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఏపీలో కొత్తగా వేయికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృత్యువాత పడ్డారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఏపీలో 1031 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 65 వేల 705కి చేరుకుంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్ వ్యాధితో 6,970 మంది మరణించారు ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి 1081 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 

దాంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 46 వేల 120కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 12,615 పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 98 లక్షల 55 వేల 316 కరోనా నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. 

 

: 26/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,62,810 పాజిటివ్ కేసు లకు గాను
*8,43,225 మంది డిశ్చార్జ్ కాగా
*6,970 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,615 pic.twitter.com/zO27ENpk0k

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!