పల్నాడు జిల్లాలో ఓ ఆర్టిసి, మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
నరసరావుపేట : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులంతా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు... ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదు.
వివరాల్లోకి వెళితే... వినుకొండ నుండి విజయవాడకు ప్రయాణికులతో ఆర్టిసి బస్సు బయలుదేరింది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బెంగళూరు వెళుతోంది. ఈ రెండు బస్సులు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఎదురెదురుగా వచ్చాయి. ఈ క్రమంలోనే బస్సులు అదుపుతప్పి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
undefined
వీడియో
ఈ ప్రమాదంతో నిద్రలోవున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు బస్సుల్లోని ప్రయాణికులు గాయపడ్డారు. 15 మంది క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వానికి తరలించారు. మరికొందరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. యాక్పిడెంట్ జరిగిన వెంటనే అతడు పరారైపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలిచి బస్సులు ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు.