విజయవాడలో దారుణం : తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

Published : Oct 14, 2022, 06:42 AM IST
విజయవాడలో దారుణం : తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

సారాంశం

విజయవాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

విజయవాడ : తల్లిదండ్రులు లేని ఓ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాత ఇంట్లో పెరుగుతూ.. చదువుకుంటున్న ఓ 14 యేళ్ల బాలికతో మొదట ఓ  యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తర్వాత మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు.  విజయవాడలో ఈ ఏడాది మే నెలలో జరిగిన ఈ ఘోరం బాలిక గర్భం దాల్చడంతో ఆలస్యంగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మరొకరు పాత నేరస్తుడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

నోరు మూసి.. సామూహిక అత్యాచారం
బాధిత బాలిక పాఠశాల కు వెళ్లి,వచ్చేటప్పుడు పటమటకు చెందిన సాయి అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో పాఠశాల సమీపంలోని భవనం వద్దకు తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత మరోసారి ఆమెను అదే భవనంలోకి తీసుకువెళ్ళాడు. తన స్నేహితులైన ప్రకాష్, ఇంకో బాలుడిని అక్కడికి రప్పించాడు. వారు ముగ్గురు కలిసి ఆ బాలిక నోరు మూసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత సాయి మరోసారి ఆమెపై లైంగికదాడి చేశాడు.  ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాలిక తనలోతానే కుమిలిపోయింది.

స్నేహితుడ‌ని ఆశ్రయమిస్తే.. ఫ్రెండ్ భార్యపైనే కన్నేశాడు.. చివ‌ర‌కు..?

తర్వాత మచిలీపట్నం వెళ్ళిపోయింది. ఇటీవల బాలిక శరీరంలో వచ్చిన మార్పులు వచ్చాయి. ఇది గమనించిన బంధువులు ఆమెనుప్రశ్నించగా.. ఏమీ చెప్పలేదు. దీంతో గట్టిగా ప్రశ్నించగా ఆమె గర్భవతి అన్న విషయం బయటపడింది అప్పుడు.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వివరించింది.  బంధువులతో కలిసి ఈ నెల 10న విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, ప్రధాన నిందితుడు సాయికి నేరచరిత్ర ఉంది. చోరీలకు పాల్పడుతూ.. ఆ డబ్బుతో అమ్మాయిలను ఉచ్చులోకి లాగుతాడు. ఓ దేవాలయంలో దొంగతనం కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టయ్యాడు సాయి. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా సబ్ జైల్లో ఉన్నాడు. అతని స్నేహితులైన ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి కోసం గాలిస్తున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇప్పటికీ అత్యాచారానికి సంబంధించిన షాక్ లోనే ఉంది. ఇంకా తేరుకోలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu