యరపతినేని అక్రమ మైనింగ్ పై పోరు: బొత్స సహా వైసిపి నేతల అరెస్టు, ఉద్రిక్తత

By rajesh yFirst Published Aug 13, 2018, 12:48 PM IST
Highlights

గుంటూరు జిల్లా గురజాల నియోజకవగర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాదాపుగా 300కోట్లు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.

గుంటూరు జిల్లా గురజాల నియోజకవగర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. "గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాదాపుగా 300కోట్లు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటించాలని వైసీపీ నిజనిర్థారణ కమిటీ ప్రకటించింది. మైనింగ్ జరుగుతున్న కోణంకి, కేశనపల్లి, నడికుడి గ్రామాల్లో నిజనిజాలుతేల్చేందుకు సోమవారం ఈరోజు 3గంటలకు పర్యటించేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు గురజాలకు పయనమువుతున్న తరుణంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.  అక్రమ మైనింగ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో నిజనిర్థారణ కమిటి వేశారు.  అందులో భాగంగా అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారితో బొత్స వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా అంతా పోలీస్‌ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్న బొత్స...రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని చూడలేదన్నారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. మాజీమంత్రి బొత్స సత్యనారాయణతోపాటు...

"

మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అక్రమ మైనింగ్ విషయంలో ఈ ఏడాది జూలై 25న మాజీ ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రైవేట్ భూములలో అనుమతులు లేకుండా 300కోట్లు విలువైన 28లక్షల టన్నుల లైమ్ స్టోన్ ను తరలించినట్లు పిటీషన్లో పిల్ లో ఆరోపించారు. ఈ అంశంపై ఆగష్టు24న ఏపీ ప్రభుత్వం తమ వాదనలను వినిపించనుంది.

 

click me!