ఏపీ: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 19,94,207కి చేరిన సంఖ్య, ప.గోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Aug 18, 2021, 05:31 PM IST
ఏపీ: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 19,94,207కి చేరిన సంఖ్య, ప.గోదావరిలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 1433 కరోనా కేసులు నమోదవ్వగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,815 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,944 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1433 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,94,207కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,686కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 3, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, కృష్ణ 3, నెల్లూరు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 1, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,815 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,64,577కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 68,041 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,58,35,650కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,944మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 29, చిత్తూరు 204, తూర్పుగోదావరి 137, గుంటూరు 137, కడప 79, కృష్ణ 138, కర్నూలు 16, నెల్లూరు 194, ప్రకాశం 104, శ్రీకాకుళం 39, విశాఖపట్నం 70, విజయనగరం 70, పశ్చిమ గోదావరిలలో 216 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: ప‌వ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న‌..ముంబ‌యి ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శ‌
క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology