నిత్య పెళ్లి కొడుకు కర్నాటి సతీష్ బాబుకు రిమాండ్.. కోర్టు వద్ద కెమెరాలు లాక్కొని ఓవరాక్షన్

By Siva Kodati  |  First Published Jul 28, 2022, 4:29 PM IST

నిత్య పెళ్లికొడుకు కర్నాటి సతీష్ బాబుకు గుంటూరు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కోర్టు నుంచి రిమాండ్‌కు తీసుకెళ్తుండగా వీడియో చిత్రీకరిస్తున్న కెమెరాలను లాక్కొనేందుకు ప్రయత్నించాడు సతీశ్ బాబు. 


గుంటూరు (guntur) నిత్య పెళ్లికొడుకు కర్నాటి సతీష్ బాబుకు (karnati satish babu) 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. సతీశ్ బాబు ఇప్పటి వరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గతంలో జరిగిన పెళ్లిళ్లు దాచిపెట్టి.. మోసం చేశాడు. ఐదో భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదుతో నిత్య పెళ్లి కొడుకు కర్నాటి సతీష్ బాబు, అతని తండ్రి వీరభద్రరావులను దిశా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో సతీశ్ బాబుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే కోర్టు నుంచి రిమాండ్‌కు తీసుకెళ్తుండగా వీడియో చిత్రీకరిస్తున్న కెమెరాలను లాక్కొనేందుకు ప్రయత్నించాడు సతీశ్ బాబు. 

ఇకపోతే.. ఈ ఏడాది జూన్ 16న ఓ యువతిని సతీష్  వివాహం చేసుకొన్నాడు. ఈ నెల 2వ తేదీన సతీష్ బాబు పెళ్లిళ్ల విషయం ఆ యువతికి తెలిసింది. సతీష్ బాబు ఫోన్లో రెండో భార్యతో చేసిన చాటింగ్ వ్యవహరం చూసిన బాధిత యువతి భర్త సతీష్ బాబును నిలదీసింది. తొలుత ఈ విషయమై సతీష్ బాబు బుకాయించినట్టుగా బాధితురాలు  మీడియాకు తెలిపింది.

Latest Videos

Also REad:ఐదు పెళ్లిళ్లు చేసుకొన్న ఎన్ఆర్ఐ సతీష్ బాబు:ఐదో భార్య ఫిర్యాదుతో అరెస్ట్

తన భర్త వ్యాపారాల విషయమై గూగుల్ లో సెర్చ్ చేస్తే అతనిపై నమోదైన కేసులు, భార్యల విషయమై తనకు మరింతగా తెలిసిందని బాధితురాలు వాపోయింది. ఈ విషయమై తన భర్త పేరేంట్స్‌ని అడిగితే రెండో పెళ్లి గురించి చెప్పారన్నారు. తన భర్తను నిలదీస్తే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె మీడియాకు తెలిపారు. తన భర్తకు గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాలను దాచి పెట్టి మోసం చేసి తనను పెళ్లి చేసుకొన్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై దిశ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు పిర్యాదు చేసింది. దీంతో ఎన్ఆర్ఐ సతీష్ బాబును దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!