Atmakur Bypoll : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ, బరిలో 14మంది అభ్యర్థులు...

Published : Jun 10, 2022, 12:04 PM IST
Atmakur Bypoll : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ, బరిలో 14మంది అభ్యర్థులు...

సారాంశం

మేకపాటి గౌతంరెడ్డి మృతిలో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నికకు బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

ఆత్మకూరు :  శ్రీ పొట్టి శ్రీరాములు nellore జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం Atmakur bypollకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసిందని Returning Officer జిల్లా జాయింట్ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులో ఇన్చార్జ్ ఆర్టీవో బాపిరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  మొత్తం ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు.

స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు అని చెప్పారు. బిజెపి, bsp, వైఎస్ఆర్సిపి, అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉన్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు. 

కాగా, ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండలని టీడీపీ జూన్ 2న ప్రకటించింది. ఆత్మకూరు ఉపఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మేకపాటి గౌతంరెడ్డి కుటుంబసభ్యులు కూడా విక్రంరెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపాలనే విషయం మీద ఏకాభిప్రాయానికి వచ్చారు. మేకపాటి గౌతం రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

దివంగత మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు విక్రంరెడ్డిని బరిలోకి దింపినందున ఈ స్థానంలో పోటీ చేయడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక విషయమై YCP నేతల సవాళ్ల విషయమై చంద్రబాబు మండిపడ్డారు. బద్వేల్ బైపోల్ లో ఎందుకు దూరంగా ఉన్నామో ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ఎవరికీ కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు చెప్పారు. నీటి పారుదల శాఖ ఇంజనీర్ పై ఎమ్మెల్యే  దాడి విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 

2021 లో జరిగిన  బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. ఈ స్థానానికి అందరి కంటే ముందుగానే టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. అయితే  బద్వేల్ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యే  వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో వెంకట సుబ్బయ్య భార్యకు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను కోరింది. దీంతో పోటీ నుండి తప్పుకోవాలని టీడీపీ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొంది టీడీపీ. సంప్రదాయాలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ వివరించింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 29న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 6వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. జూన్  9న  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.  ఈ నెల 30న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం మొదలైంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!