గుడివాడ ఏమైనా పాకిస్తానా , ఎవ్వరూ రాకూడదా.. చంద్రబాబును తిడితే నేనూ తిడతా : కొడాలి నానికి బుద్ధా వార్నింగ్

By Siva KodatiFirst Published Jan 25, 2022, 5:04 PM IST
Highlights

గుడివాడలో క్యాసినో (gudivada casino) వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నానిపై (kodali nani) విరుచుకుపడ్డారు టీడీపీ (tdp)  నేత బుద్ధా వెంకన్న (buddha venkanna) . కొడాలి నానికి పాన్ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవని.. అలాంటి నానికి అంత డబ్బు ఎక్కడిది, పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎలా కట్టగలిగారు..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

గుడివాడలో క్యాసినో (gudivada casino) వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నానిపై (kodali nani) విరుచుకుపడ్డారు టీడీపీ (tdp)  నేత బుద్ధా వెంకన్న (buddha venkanna) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు అని ఆరోపించారు. కొడాలి నానికి చంద్రబాబు (chandrababu naidu) గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కొడాలి నానికి పాన్ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవని.. అలాంటి నానికి అంత డబ్బు ఎక్కడిది, పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎలా కట్టగలిగారు..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

కొడాలి నానిపై ఫిర్యాదు చేస్తే అఫిడవిట్ ఇవ్వలేదని.. గుడివాడమేన్నా పాకిస్తానా..? ఎవ్వరూ గుడివాడ వెళ్లకూడదా..? అని ఆయన నిలదీశారు. మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారని.. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. 

కొడాలి చేసే కామెంట్లను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అసహ్యించుకుంటారని.. 1991లో నెలకు రూ.1.15లక్షల అద్దె కట్టి తాను కొబ్బరికాయల వ్యాపారం చేశానని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు గురించి కొడాలి నాని మాట్లాడితే... తాను కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొడాలి నాని మాట్లాడడం మానేస్తే తాము కూడా మాట్లాడబోమని తేల్చిచెప్పారు. తనపై కేసు నమోదు చేసి విచారించినట్టే కొడాలి నానిపైనా కేసు నమోదు చేసి విచారించాలని బుద్ధా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.

కాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను సోమవారం నాడు సాయంత్రం పోలీసులు Arrest చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై  విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు సోమవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై బుద్దా వెంకన్న నుండి వివరణ తీసుకొంటామని పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు.  

అయితే  బుద్దా వెంకన్న ఇంటి లోపలికి పోలీసులు రాకుండా ఆయన అనుచరులు గేట్లు వేశారు. ఈ విషయం తెలుసుకొన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నేత నాగుల్ మీరా తదితరులు బుద్దా వెంకన్న ఇంటికి వచ్చారు. . సీఎం జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా బుద్దా వెంకన్నకు నినాదాలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీస్ స్టేషన్ కు రావాలని ఎలా కోరుతారని బుద్దా వెంకన్న పోలీసులను ప్రశ్నించారు. 

2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోతే  ప్రజలు kodali Naniని చంపుతారని టీడీపీ నేత Buddha Venkanna వ్యాఖ్యలు చేశారు. Chandrababu  ఇంటి గేటును తాకినా కూడా నాని శవాన్ని పంపుతామని కూడా ఆయన హెచ్చరించారు.   సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో సందర్భంగా సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని ఆయన చెప్పారు. అయితే  ఇందులో డీజీపీ వాటా ఎంత అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

click me!