ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: 8,86,694కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 22, 2021, 05:21 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: 8,86,694కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 137 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 137 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694కి చేరింది.

కరోనా కారణంగా నిన్న నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,146కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,488 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 167 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,78,060కి చేరుకుంది. నిన్న 48,313 మందికి కోవిడ్ టెస్టులు చేయగా... రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం నిర్ధారణా పరీక్షల సంఖ్య 1,27,87,961కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 15, చిత్తూరు 12, తూర్పుగోదావరి 17, గుంటూరు 16, కడప 4, కృష్ణా 17, కర్నూలు 8, నెల్లూరు 6, ప్రకాశం 7, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 17, విజయనగరం 5, పశ్చిమ గోదావరిలలో 8 కేసులు నమోదయ్యాయి.

అలాగే నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu