ఏపీలో విజృంభిస్తోన్న కరోనా: ఒక్కరోజులో 12615 మంది పాజిటివ్.. చిత్తూరు, విశాఖలలో 2 వేలకు పైగా కేసులు

By Siva Kodati  |  First Published Jan 20, 2022, 5:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,615 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,37,161కి చేరుకుంది.


ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,615 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,37,161కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,527కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 3,674 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,63,763కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 47,420 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,20,12,102కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 53,871 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 951, చిత్తూరు 2338, తూర్పుగోదావరి 627, గుంటూరు 1066, కడప 685, కృష్ణ 363, కర్నూలు 884, నెల్లూరు 1012, ప్రకాశం 853, శ్రీకాకుళం 464, విశాఖపట్నం 2117, విజయనగరం 1039, పశ్చిమ గోదావరిలలో 216 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

Latest Videos

undefined

కాగా.. Indiaలో గత 24 గంటల్లో 3,17,532 coronaకేసులు నమోదయ్యాయి.  అంతేకాదు దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 491 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,87,693కి చేరుకొంది.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా నమోదైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసులు 93,051 కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 2,23,990 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 3,58,07,029కి చేరుకొంది.

కరోనా యాక్టివ్ కేసులు 5.03 శాతంగా నమోదయ్యాయి. కరోనా రోగుల రికవరీ రేటు 93.69 శాతానికి తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ  మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారంగా దేశంలో ఇప్పటివరకు 9,287 Omicron కేసులు నమోదయ్యాయి.  బుధవారం నుండి ఈ కేసుల్లో 3.63 శాతం పెరుగుల కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 గా నమోదైంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 159.67 కోట్ల వ్యాక్సిన్ అందించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కొత్త కేసుల నమోదులో 16.41 శాతంగా నమోదైంది.గత ఏడాది మే 15న 3,11,077 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మూడు లక్షలను దాటడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

 

: 20/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,37,161 పాజిటివ్ కేసు లకు గాను
*20,68,763 మంది డిశ్చార్జ్ కాగా
*14,527 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,871 pic.twitter.com/6m1UQbxI2D

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!